కసివింద, శాస్త్రీయనామం, పేర్లు, ఉపయోగాలు, వాడేవిధానం, దీనిలోని రసాయనాలు

kasivinda

కసివింద:

శాస్త్రీయనామం

cassia occidentalis linn

పేర్లు:

తగరిస,కోల,కాసమర్ద,పెద్ద చెన్నంగి

రసాయనాలు:

సెన్నోసైడ్లు,నాప్తలీన్ గ్లైకోసైడ్లు,క్రైసోఫినాల్,ఎమోడిన్,నియాసిన్

Photo:

kasivinda

ఉపయోగాలు:

–వేరు,పసుపు సమానంగా గచ్చకాయ పరిమాణంలో సేవిస్తే తెల్లబట్ట తగ్గును.

–దీని గింజలను కాఫికి బదులుగా వాడుతారు(కాఫి వాసన వస్తుంది)

–గింజలు అతిమూత్ర వ్యాధిని తగ్గించును.

–ఆకుల చూర్ణం దగ్గు,ఆస్తమ తగ్గించును.

–ఆకు రసం రక్తం కారే గాయాలను తగ్గించును.

–ఆకు రసం,వెన్న కలిపి శరీరం మొత్తం రాసి గంట తరువాత స్నానం చేస్తె కాళ్ళు,చేతులు వణుకుట తగ్గును.

–వేరు బెరడు కషాయంలో పటిక కలిపి చల్లార్చి ఆ నీటితో ఎనిమా చేస్తే పేగు జారడం తగ్గును.

–వేరును పుల్లటి మజ్జిగతో నూరి తామర,సొరియాసిస్ కు రాయాలి.

–దీని ఆకు రసం వెన్నెతో కలిపి మర్ధన చేస్తే పక్షవాతం తగ్గును.

–వేరు గంధం తేలు కాటు దగ్గర రాయాలి.

–ఆకు రసం త్రాగితే శిఘ్ర ప్రసవం జరుగును.

–ఆకులను వెచ్చ చేసి రెండు చుక్కల రసం చెవిలో వేస్తే చెవిపొటు తగ్గును.

–వేరును నెయ్యితో నూరి సేవిస్తే బోదకాలు తగ్గును.

–కాసమర్ధ,అరిమర్ధ,కాసారి,కర్కశ,కాలంకత

–దగ్గును తగ్గించును అందుకే కాసమర్ధ అనిపేరు వచ్చింది.

–విత్తనాల చూర్ణం సేవిస్తే అతిమూత్రం తగ్గును.

–వేరును నిమ్మరసంతో రాస్తే తామర తగ్గును.

–ఆకు రసంతో తైలం చేసి రాస్తే పక్షవాతనొప్పులు,వాతనొప్పులు తగ్గును.

–ఆకు ముద్దలో కోడిగ్రుడ్డు తెల్లసొన,పసుపు,సున్నం కలిపి పట్టువేస్తే విరిగిన ఎముకలు అతుకుతాయి.

–ఆకులను ముద్దగా నూరి గ్రుడ్డుతెల్లసొన కలిపి మెత్తని గుడ్డ్కు పట్టించి వాచిన వృషణాలకు కడితే వాపు తగ్గుతుంది.

–దీని ఆకు,కుప్పింటాకు,ఉత్తరేణిఆకు,నల్ల ఉమ్మెత్త ఆకు,సున్నం కలిపి మెత్తగా నూరి పట్టువేస్తే అడ్డజీరలు తగ్గుతాయి.

–కసివింద చిగుళ్ళు ,గసగసాలు  నూరి ఆ ముద్దను రోజుకు రెండుపూటలు త్రాగి పాలు త్రాగితే జాండిస్ తగ్గుతుంది.

–పశువులకు దెబ్బతగిలి కంటిలో పువ్వువేస్తే ఆకు రసం కంటిచుక్కలుగా 4 రోజులు వెయ్యాలి.

–దీని పూలు,తెల్లమద్ది బెరడు,వేగిస బెరడు సమానంగా కలిపి 1 స్పూన్ పొడి పాలతో తీసుకొంటే క్షయ తగ్గును.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *